ఏపీ ప్రభుత్వంపై ముద్రగడ ఫైర్...వారికి లేని రూల్స్ నాకెందుకు..
posted on Nov 23, 2016 3:54PM
కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన పాదయాత్ర కూడా చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన పాదయాత్రను మాత్రం ప్రభుత్వం అడ్డుకుంటుంది. దీనిపై స్పందించిన ముద్రగడ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం తాను చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రను ఎందుకు అడ్డుకున్నారని..గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలలు ప్రభుత్వ అనుమతులతోనే పాదయాత్రలు చేశారా? వారికి లేని రూల్స్ తనకు మాత్రమే ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని అన్నారు. అంతేకాదు రాజస్థాన్ లో గుజ్జర్లు, గుజరాత్ లో పటేళ్లు ప్రభుత్వాలు అనుమతి ఇస్తేనే ఉద్యమించారా? అని ప్రశ్నించారు. కాపు జాతిని తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని విమర్శించారు.