రెండు రాష్ట్రాలకు నిరాశ మిగిల్చిన కేంద్రం..

 

తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపుపై ఎప్పటి నుండో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆశలపై కేంద్రం నీరు జల్లినట్టు తెలుస్తోంది. ఏపీలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 175కి పెంచుకునే వెసులుబాటును విభజన చట్టంలో కల్పించారు. దీంతో, తమ రాష్రంలో నియోజకవర్గాలను పెంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే ఈరోజు నియోజక వర్గాల పెంపు ఉండదని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ ఈ రోజు రాజ్యసభ్యలో నియోజకవర్గాల పెంపుపై అడిగిన ప్రశ్నకు బదులుగా రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ స్పష్టం చేశారు. నియోజకవర్గాలను పెంచాలంటే ఆర్టికల్ 371ను సవరించాలని... ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పని కాదని కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాలకు నిరాశే మిగిలింది.