తెలంగాణలో ఇంటింటి కుటుంబసర్వే షురూ

తెలంగాణలో ఇంటింటి కుటుంబ

సర్వే బుధవారం( నవంబర్ 6) ప్రారంభమైంది.  సర్వే ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇంటింటికి స్టిక్కర్లను అంటించిన అధికారులు వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.  ప్రతీ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి  ఎన్యూమరేటర్లు సర్వే నిర్వహిస్తారు. ఎక్కువగా టీచర్లే ఎన్యుమరేటర్లుగా ఉండటం విశేషం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకయ, కుల సమగ్ర సర్వే  చేయాలని తెలంగాణ ప్రభుత్వం  వీరిని నియమించింది.  కుటుంబసర్వేలో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి.  ఫామ్ 1లో మొత్తం 58 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుతారు. ఫామ్ 2లో 17 ప్రశ్నలుంటాయి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదని ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను కోరింది.