బాలీవుడ్ నటి మీనాక్షి తపర్ హత్య చేసిన సహానటులు
posted on Apr 20, 2012 4:19PM
బాలీవుడ్ నటి మీనాక్షి తపర్ ని సహనటులు దారుణ౦గా హత్య చేశారు. మధుర్ భండార్కర్ 'హీరోయిన్' చిత్రంలో కరీనా కపూర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న మీనాక్షిని ఆమెతో నటించే సహనటులు నమ్మించి హతమార్చారు. మీనాక్షి తపర్ సహనటులు అమిత్ జైస్వాల్ అతడి ప్రియురాలు ప్రీతి సురీన్లిద్దరూ కిడ్నాప్ చేసిన అనంతరం మీనాక్షి తల్లిదండ్రులకు పోన్ చేసి రూ. 15 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. అయితే మీనాక్షి తల్లిదండ్రులు రూ. 60 వేలు మాత్రమే ఇవ్వడంతో మీనాక్షిని వదల్లేదు. చివరికి ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోసి వాటర్ ట్యాంకులో పడవేశారు. అనంతరం మీనాక్షి తలను వాళ్లు బస చేసిన హోటల్ గది కిటికీలో నుంచి రోడ్డుపై వెళుతున్న ఓ బస్సుపై విసిరేశారు. ముంబయి పోలీసులు మంగళవారం ప్రీతి ఆమె ప్రియుడు జైస్వాల్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. జార్జిటౌన్ పోలీసు స్టేషన్లో వారిద్దని ఇంటరాగేట్ చేశారు. నిందితురాలు ప్రీతీ ఇల్విన్ తండ్రి నవీన్ అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోని సెప్టిక్‌ట్యాంక్‌లోనే మీనాక్షి మృతదేహం కనుగొన్నారు. నెల రోజుల క్రితం మోడల్‌ను చంపేసి మృతదేహం మూటకట్టి అందులో పడేసినట్టు నిందితులు చెప్పారు.