ఇంటర్ ఫస్ట్ఇయర్ ఫలితాలలో బాలికలదే పై చేయి

ఆంద్రప్రదేశ్ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో బాలికలలే పై చేయి సాదించారు. శుక్రవారం ఉదయం విడుదల చేసిన ఫలితాలలోఉత్తీర్ణత శాతం 53.75 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 58.32గా ఉంది. బాలుర ఉత్తీర్ణత శాతం 49.73గా ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో పాసైన మొత్తం విద్యార్ధులు 4,57,146 మంది కాగా, ఎ గ్రేడ్‌లో 89,479, బి గ్రేడ్‌లో 47,248 మంది విద్యార్థులు పాసయ్యారు.గత మూడేళ్లుగా ఏటికేడు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలీస్తే 1.53 శాతం ఉత్తీర్ణత ఈ సంవత్సరం పెరిగింది. కృష్ణా జిల్లా 71 శాతంతో మొదటి స్థానంలో ఉండగా 37 శాతంతో మహబూబ్‌నగర్ జిల్లా(పాలమూరు) ఆఖరు స్థానంలో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu