మయన్మార్ భూకంప ప్రభావం.. భారత్ లోనూ కంపించిన భూమి

మ‌య‌న్మార్ లో సంభ‌వించిన భూకంప ప్రభావం భారత్ లోనూ కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ సహా  కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నా, మేఘాలయలో  భూమి కంపించింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు.  ఒక్క భారత్ లోనే కాకుండా  అలాగే బంగ్లాదేశ్,చైనాల‌లో కూడా భూమి కంపించింది. 

బ్యాంకాక్, మయన్మార్ లో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం ధాటికి భారీ భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోయాయి. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు సమాచారం. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  భారత ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ మయన్మార్, బ్యాంకాక్ లో భూకంప బాధితులకు సహాయం అందించడానికి దేశం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ ఆపత్సమయంలో భారత్ వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.