పైలట్ అవతారమెత్తిన కేతిరెడ్డి

ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాల్లో ఇన్‌యాక్టివ్ అయిన వైసీపీ నేతలు ఎవరి వ్యాపాకాల్లో వారు పడ్డారు. తమకు నచ్చింది చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ  కీలక నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. నయా అవతారం ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నేతల్లో కేతిరెడ్డి ఒకరు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు.. తన నియోజకవర్గం, పార్టీ సమావేశాలు, ఇతర కార్యక్రమాల గురించి .. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో తరచుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండేవారు.  2024 ఎన్నికల్లో కూటమి గాలికి కొట్టుకుపోయారు. ప్రస్తుతం ఆయన తన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు.

 కేతిరెడ్డి తాజాగా పైలట్ అవతారం ఎత్తారు. తానే స్వయంగా ప్రైవేట్ జెట్‌ని నడిపిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల నిజమయ్యింది అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. కల నిజమైంది. అధికారికంగా పైలట్ అయ్యా. ఇది ప్రారంభం మాత్రమే. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇలాంటి సాహసాలు మరెన్నో ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో ప్రైవేట్ జెట్‌ నడిపి తన కల నెరవేర్చుకున్నారు.