పఠాన్ కోట్ దాడి సూత్రధారి మసూద్‌ అజ్‌హర్ కు రెడ్ కార్నర్ నోటీస్


పంజాబ్ పఠాన్ కోట్ విమాన స్థావరం పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి విదితమే. ఈ దాడులకు ప్రధాన సూత్రధారి జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్‌ అజ్‌హర్ అని కూడా తెలుసు. అయితే ఇప్పుడు అజ్‌హర్ కు, అతని సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌లపై ఇంటర్నేషనల్‌ పోలీస్‌ అసోసియేషన్‌ (ఇంటర్‌పోల్‌) నేడు రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది. ఉగ్రదాడికి సంబంధించి అజ్‌హర్‌, అబ్దుల్‌ రవూఫ్‌లపై నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రత్యేక కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. అనంతరం ఎన్‌ఐఎ వారిద్దరిపై రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ చేయాలని ఇంటర్‌పోల్‌ను అభ్యర్థించించగా.. ఇంటర్‌పోల్ రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ జారీ చేసింది.

 

కాగా ఈ దాడుల జరిగినప్పుడు భారత్ తగిన ఆధారాలు చూపించిన పాక్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాదు అజహర్ ను అరెస్ట్ చేశాం.. గృహనిర్భంధంలో ఉంచా.. అని ముందు చెప్పి ఆ తరువాత మాట మార్చేసింది.