మోడీతో ముగిసిన చంద్రబాబు భేటీ..
posted on May 17, 2016 3:45PM
ప్రధాని నరేంద్రమోడీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి భేటీ ముగిసింది. గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో ఏపీ ప్రత్యేక హోదాతో పాటు ఇంకా పలు అశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు 12 ముఖ్యమైన అంశాలతో కూడిన నివేదికను ప్రధానికి అందించినట్టు సమాచారం. 2014-15 రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతికి నిధులు, వెనుకబడిన 7 జిల్లాలకు అభివృద్ధి కింద సాయం, విభజన చట్టం షెడ్యూల్ 9,10లోని సంస్థల ఏర్పాటు, పారిశ్రామిక రాయితీలు, విశాఖ రైల్వేజోన్, నియోజకవర్గాల పునర్విభజన, ప్రత్యేక ఆర్థిక సాయం అంశాలతో కూడిన నివేదికను ప్రధానికి ఇచ్చారు.
అయితే చర్చలో భాగంగా ప్రధాని మోడీ ఏం హామీ ఇచ్చారు.. ప్రత్యేక హోదాకు అనుకూలంగా స్పందిచారా.. లేదా.. అన్న విషయం చంద్రబాబు ఇంకా చెప్పలేదు. మోడీ భేటీ ముగిసిన అనంతరం ఆయన నేరుగా ఏపీ భవన్ కు వెళ్లిపోయారు. సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించనున్నారు.