‘మనోహరుడు’ని పట్టించుకున్నోళ్ళే లేరు...

 

‘మనోహరుడు’ ఈ సినిమా పేరు ఎక్కడైనా విన్నట్టుందా? బాగా ఆలోచిస్తే గుర్తొస్తుంది.... బుధవారం నాడు విడుదలైన శంకర్, విక్రమ్ సినిమా ‘ఐ’కి తెలుగులో పెట్టిన పేరు. అయితే ఈ టైటిల్ని ఎవరూ పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు. అందరూ ‘ఐ’ అంటున్నారే తప్పించి ‘మనోహరుడు’ అని ఎవరూ అనడం లేదు. చివరికి ‘ఐ’ తెలుగు వెర్షన్ పబ్లిసిటీలో కూడా మనోహరుడు అనే మాటను వాడటం లేదు. తెలుగు మీడియా మొత్తం ‘ఐ’ అంటూ రివ్యూలు, విశ్లేషణలు ఇచ్చిందే తప్ప ‘మనోహరుడు’ అని పొరపాటున కూడా అనలేదు. అయినా ‘ఐ’ అనే క్యాచీగా వుండే చక్కని పేరు వుండగా.. ‘మనోహరుడు’ అని పెట్టినవాళ్ళని అనాలి.