ప్రధానికి తెలంగాణ వాదుల నిరసన
posted on Oct 16, 2012 11:09AM
.jpeg)
ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సుకు ప్రధాని మన్మోహన్ సింగ్ వస్తున్నారు. హైదరబాద్ భద్రతా వలయంలో ఉంది. సదస్సు జరుగుతున్న మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రధాని పర్యటన కోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీజీ కమాండోలు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకొని కీలక ప్రాంతాల్లో మోహరించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్యాహ్నం 2:45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో 3:20కి హెచ్ఐసీసీకి చేరుకొని జీవ వైవిధ్య సదస్సులో పాల్గొంటారు. హెచ్ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో 4:05కు జీవ వైవిధ్య పార్కులో నెలకొల్పిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. తెలంగాణాపై ప్రతికూల వైఖరికి నిరసనగా ప్రధాని హైదరాబాద్ పర్యటనలో తీవ్ర స్థాయిలో నిరసన తెలపాలని తెలంగాణవాదులు బావిస్తున్నారు, తెలంగాణ జెఎసి అధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర ఆందోళనలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నల్ల బెలూన్లను పెద్ద ఎత్తున గాల్లోకి ఎగరేసి నిరసన తెలపాలని టీ జెఎసి నిర్ణయించింది.