మల్లాది విష్ణువుకి మరో దెబ్బ.."కాల్ మనీ" లో కూడా..!
posted on Dec 14, 2015 3:37PM
.jpg)
ఇప్పటికే కల్తీ మందు వ్యవహారంలో కాంగ్రెస్ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ కేసు విషయంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మల్లాది విష్ణు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు.ఆయన కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.ఇప్పుడు మళ్లీ ఏపీలో సంచలనమైన కాల్ మనీ కేసులో కూడా ఈయన చేయి ఉన్నట్టు తెలుస్తోంది.ఈ వ్యవహారంలో సులోచన అనే మహిళ.. మల్లాది విష్ణు అనుచరుడు గణేశ్ తమకు రూ.లక్ష అప్పుగా ఇచ్చి బదులుగా రూ.4లక్షలు వసూలు చేశారని..తన ఇంటిని కూడా లాక్కున్నారంటూ మలాది విష్ణు..అతని అనుచరుడు గణేష్ పై ఫిర్యాదు చేసింది.దీంతో ఈ వ్యవహారంలో కూడా మల్లాది విష్ణువు పేరు బయటకు వచ్చింది.
ఇదిలా ఉండగా.. ఏపీ సీఎం చంద్రబాబు కాల్ మనీ దందాపై జులుం విసిరారు.కాల్ మనీ బాధితులు ఎవరూ డబ్బులు తిరిగి చెల్లించొద్దంటూ..ఇలాంటి అవినీతి,అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు.ఏది ఏమైనా కల్తీ మద్యం విషయంలో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాది విష్ణువుకి కాల్ మనీ వ్యవహారంతో మరో ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మరోవైపు కాల్ మనీ కేసులో ఏపీ సీఎస్ కు హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది.ఈవ్యవహారంపై జనవరి 18 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.