చెల్లెలి చావు తెలివి తేటలు.. తండ్రి సొమ్ము కోసం అన్నల మర్డర్ 

తండ్రి డెత్ బెనిఫిట్స్ కోసం ఓ కూతురు చావు  తెలివి తేటలు ప్రదర్శించింది. ఇద్దరు అన్నలను చంపేస్తే తండ్రి డెత్ బెనిఫిట్స్ మింగేయవచ్చు అని కలలు కన్నది. ఆమెకు ప్రియుడు దానయ్య తోడయ్యాడు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నలను మట్టు పెట్టింది. ఖేల్ ఖతమ్ అనుకుంది కానీ సీన్ రివర్స్ అయ్యింది. పల్నాడు జిల్లాలో డబుల్ మర్గర్ కేసులో ఈ చెల్లి  కటకటాలపాలైందిహత్యకు గురైన వారిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండటం గమనార్హం. తన ఇంట్లోనే చెల్లెలి  రూపంలో  ఓ కరడు గట్టిన నేరస్థురాలు ఉందని ఆ కానిస్టేబుల్ ఊహించలేకపోయాడు. 

 నకిరికల్ డబుల్ మర్దర్ కేసును పోలీసులు చేధించారు. ప్రియుడితో కల్సి స్కెచ్ వేసినప్పటికీ అది వికటించింది. నవంబర్ 26వ తేదీన  రక్తం పంచుకుని పుట్టిన అన్న  రామకృష్ణను చున్నీతో చంపేసింది  కృష్ణవేణి . శవాన్నిగోరంట్ల కాలువలో పడేసింది. ఈ మర్డర్ కేసులో ప్రియుడు దానయ్య పూర్తిగా సహకరించాడు.  ఈ మర్డర్ బయటపడలేదు. వెంటనే   కృష్ణవేణి మరో అన్నను మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యింది.  అన్న గోపికృష్ణ కానిస్టేబుల్. స్వంత చెల్లెలు హత్య చేస్తుంది అని పసిట్టలేకపోయాడు. మద్యంలో విషం కలి చంపేసింది కృష్ణవేణి. ఈ డెడ్ బాడీని కూడా అదే గోరంట్ల కాలువలో పడేసింది. రెండు మర్డర్ లు ఒకే విధంగా ఉన్నట్లు పోలీసులకు డౌటొచ్చింది. కూపీ లాగితే స్వంత చెల్లెలు కృష్ణవేణి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చేధించారు. కృష్ణవేణికి ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ప్రియుడు  దానయ్యమోజులో పడి విలాసాలకు అలవాటు పడింది.  అన్నలను చంపేస్తే నలుగురు టీనేజి యువకుల కోరిక తీరుస్తానని కృష్ణవేణి  ఆశపెట్టిందని పోలీసులు తెలిపారు. 
కృష్ణవేణి డబ్బుల కోసం  స్వంత అన్నలను చంపడం  పల్నాడు జిల్లాలో సంచలనమైంది. పవిత్రమైన అన్నా చెల్లెల బంధానికే  ఈ కేసు మాయని మచ్చగా మిగిలింది.