సంధ్య థియేటర్ ఘటనలో స్పృహ కోల్పోయిన శ్రీతేజ్
posted on Dec 17, 2024 4:53PM
సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ హాజరైన సమయంలో థియేటర్ లో తొక్కిసలాటనేపథ్యంలో తల్లికొడుకు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ప్రాణా పాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ స్పృహ పూర్తిగా కోల్పోయినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. తొక్కిసలాట వల్ల శ్రీతేజ్ మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల డ్యామేజి అయ్యిందని, ఈ కారణంగా స్పృహ కోల్పోయినట్టు కమిషనర్ తెలిపారు. సుదీర్ఘకాలం వైద్యం అందాల్సి ఉందన్నారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించనుందన్నారు. బాలుడిని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు సివి ఆనంద్ తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం లేదని ఆయన తెలిపారు.