జమిలీ బిల్లుకు డుమ్మా కొట్టిన బిజెపి ఎంపీలకు షోకాజ్ నోటీసులు
posted on Dec 18, 2024 11:38AM
లోకసభలో ఎన్డిఏ ప్రవేశ పెట్టిన జమిలీ బిల్లుకు బిజెపికి చెందిన ఎంపీలు డుమ్మా కొట్టారు. ఇంత కీలకమైన బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో అధికారపార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులు గైర్హాజర్ కావడం చర్చనీయాంశమైంది. కేంద్రమంత్రులైన గడ్కరీ, గిరిరాజ్, జ్యోతిరాదిత్య, సిపి పాటిల్ తదితరులు డుమ్మా కొట్టారు. విప్ జారీ చేసినప్పటికీ బిజెపి ఎంపీలు, ఐదుగురు కేంద్రమంత్రులు డుమ్మా కొట్టడం పట్ల బిజెపి అధిష్టానం సీరియస్ గా ఉంది. , ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు ను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. లోకసభలో బిజెపికి మెజార్టీ లేనప్పటికీ బిజెపి ఈ బిల్లును ప్రవేశ పెట్టింది ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ బిల్లుకు మద్దత్తు పలికింది. కానీ బిజెపి ఎంపీలు 20 మంది డుమ్మా కొట్టడం పట్ల అధిష్టానం సీరియస్ అయ్యింది. వారికి షోకాజ్ నోటీసులు పంపింది. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ రాం మేఘవాల్ ఈ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టారు.