చిరుకి యూకే లైఫ్ టైమ్ ఎఛీవ్ మెంట్ పురస్కారం
posted on Mar 20, 2025 2:10PM

సినీ రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేసి అందరివాడుగా నిలిచిన మెగా స్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కీర్తికిరీటంల మరో కలికితురాయి చేరింది. ఇప్పటికే దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మ విభూషన్ పురస్కారాలు అందుకున్న చిరంజీవి తాజాగా బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రజాప్రతినిథులు, ప్రముఖుల సమక్షంలో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు. బ్రిటన్ అధికార లేబర్ పార్టీ ఎంపి నయెందు మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ సినీ రంగాలలో చిరంజీవి సేవలకు గుర్తింపుగా యూకే గుర్తింపుగా యుకె పార్లమెంట్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ పురస్కారం అందజేసింది. యూకే పార్లమెంటు నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు చిరంజీవే కావడం గమనార్హం.
ప్రతిష్ఠాత్మకమైన యూకే పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ కు శుభాకాంక్షలు అందజేస్తూ తన సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక అన్నయ్య కంటే తండ్రి సమానుడిగా ఆయన్ను గౌరవిస్తానని, జీవితంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నప్పుడు దిక్సూచిగా నిలిచిన మార్గదర్శి చిరంజీవి అని గుర్తు చేసుకున్నారు. 3 నంది, 9 ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఛారిటబుల్ ట్రస్టు ద్వారా లక్షలాది మందికి రక్త, నేత్ర దానాలు చేయించిన చిరు సేవలను ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.