బాబు దార్శనికతకు బిల్ గేట్స్ ఫిదా.. సీబీఎన్ తో భేటీ అద్భుతం అంటూ ట్వీట్

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు బుధవారం (మార్చి 19) ఢిల్లీలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో  భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ముప్పావుగంట పాటు జరిగిన ఈ భేటీ తరువాత చంద్రబాబు ఎక్స్ వేదిగా ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఈ భేటీ అత్యంత కీలకం అంటూ పేర్కొన్నారు. ఈ భేటీ  రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ భేటీ ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. 

కాగా చంద్రబాబుతో భేటీపై బిల్ గేట్స్ కూడా స్పందించారు. చంద్రబా దాదాపుగా 40 నిమిషాల పాటు సాగిన ఈ భేటీ గురించి బుధవారం ఆ సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు స్పందించారు. బిల్ గేట్స్ తో తాను సమావేశం అయ్యానని.. ఏపీ ప్రగతిలో కీలకం కానున్న ఈ బేటీ తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అద్భుతంగా సాగిందంటూ బిల్ గేట్స్ గురువారం (మార్చి 20)  సందించారు.  ఈ భేటీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తమ ఫౌండేషన్ కీలక ఒప్పందంపై సంతకం చేసిందన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల్లో అధునాతన సాంకేతికతను వినియోగించుకుని పురోభివృద్ధి సాధించే లక్ష్యంతో సాగుతున్న ఏపీకి తమ ఫౌండేషన్ ద్వారా సంపూర్ణ సహకారం అందించనున్నామనీ, ఒప్పందంలో భాగంగా తదుపరి కార్యాచరణపై దృష్టి సారించామని బిల్ గేట్స్ పేర్కొన్నారు.  

వాస్తవానికి బిల్ గేట్స్, చంద్రబాబుల స్నేహ బంధం 1995లో మొదలై సాగుతూనే ఉంది.  నాడు ఉమ్మడి రాష్ట్రానికి సీఎం హోదాలో చంద్రబాబు… అతికష్టం మీద గేట్స్ అపాయింట్ మెంట్ సంపాదించారు. వారి తొలి భేటీ ఢిల్లీలోనే జరిగింది. ఓ రాజకీయ నేతగా ఉండి టెక్నాలజీని ప్రభుత్వ పాలనలో వినియోగించే దిశగా మాట్లాడుతున్న చంద్రబాబును బిల్ గేట్స్ మెస్మరైజ్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు విజ్ణప్తి మేరకు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. అది మొదలు పలు దిగ్గజ సంస్థలు హైదరాబాద్ కు వచ్చాయి.   ఇటీవలే దావోస్ లో కలిసిన సందర్బంగా ఏపీకి సాయం చేయాలంటూ బాబు కోరితే… రెండు నెలలు తిరక్కుండానే గేట్స్ రంగంలోకి దిగారు, కీలక ఒప్పందాలు కుదిరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం కార్యరూపం దాల్చింది.