మంత్రి... ముఖ్యమంత్రి... ఓ ఎమ్మెల్యే... మధ్యలో సెలబ్రిటీ...
posted on Oct 24, 2015 5:31PM

మంత్రి... ముఖ్యమంత్రి... ఓ ఎమ్మెల్యే... మధ్యలో సెలబ్రిటీ...
ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రిటీలు... ఒక్కోసారి తమ మనసులో మాట బయటపెట్టేస్తుంటారు... అవి ఆ తర్వాత ఎంత దుమారం రేపుతాయో మనకందరికీ తెలిసిందే... అలా పలువురు వీఐపీలు చేసిన వివాదాస్ప వ్యాఖ్యలు మీకోసం...
( మహారాష్ట్ర మంత్రి గిరీష్ బపత్ )
- రాత్రిళ్లు మీరు మొబైల్ ఫోన్లలో ఎలాంటి క్లిప్పింగ్స్ చూస్తారో మేం కూడా అవే చూస్తాం. మాకు వయసైపోయిందని ఎలా అనుకుంటారు. మా మనసుకు సంబంధించినంత వరకూ మేము ఇంకా యువకులమే .... విద్యార్ధినీ విద్యార్ధులతో మహారాష్ట్ర మంత్రి గిరీష్ బపత్
(రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే సుందర్ లాల్)
- సెల్ ఫోన్ వల్ల అమ్మాయిల జీవితాలు పాడైపోతున్నాయి, వారు అనవసరమైన విషయాలు నేర్చుకుంటున్నారు. సెల్ ఫోన్ వల్ల యువతుల జీవితాల మీద చెడు ప్రభావం పడుతోంది, అమ్మాయిల ప్రవర్తనపై మొబైల్ ఫోన్లు తీవ్ర ప్రభావం చూపుతున్నయి, తమ కూతుళ్లకు తండ్రులు ఎవరూ కూడా సెల్ ఫోన్లు ఇవ్వొద్దు
( ములాయం సింగ్ యాదవ్ )
- మగపిల్లలు అప్పుడప్పుడు తప్పు చేస్తుంటారు. అంతమాత్రానికే అత్యాచారం చేశారని ఉరిశిక్ష వేయడం సరికాదు. మా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అత్యాచార నిందితులకి ఉరిశిక్ష రద్దుచేస్తాం
(గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్)
- నర్సులు ఎండలో సమ్మె చేస్తే గ్లామర్ పోతుంది. నల్లగా అయిపోతారు. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం
(రాంగోపాల్ వర్మ)
- తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహస్వామినే పూజించాలి, వారికి ఆంధ్రా దేవుళ్లు ఎందుకు?, తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహస్వామి కంటే ఎక్కువగా ఆంధ్రా దేవుడైన తిరుపతి వేంకటేశ్వరస్వామిని ఎందుకు పూజిస్తున్నారు