ఇది సనాతన ధర్మం మీద కుట్ర

తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ సనాతన ధర్మంపై కుట్రగా రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ అభివర్ణించారు. మీడియాతో మాట్లాడిన ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని కలియుగ దైవంగా ఎంతో భక్తితో ప్రజలు కొలిచి, లడ్డూ ప్రసాదాన్ని స్వీకరిస్తారనీ చెప్పారు. వేంకటేశ్వరుడి మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలపడం అంటే అది సనాతన ధర్మంపై జరిగిన కుట్రేనని పేర్కొన్నారు.  ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య సత్యేంద్రనాథ్ అన్నారు.