నేడు చంద్రబాబు ‘ప్రకాశం’ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 2.30 గంటలకు నాగులుప్పలపాడు మండలం చదలవాడ చేరుకుంటారు.     మద్దిరాలపాడు గ్రామంలో జరిగే ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం గ్రామ సభలో పాల్గొంటారు.  సాయంత్రం 5 గంటలకు  తిరిగి ఉండవల్లి బయలుదేరి వెళతారు.  సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.