కుక్కల విద్యాసాగర్ అరెస్టు!

ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన కేసులో  పోలీసులు తొలి అరెస్టు చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ఈ రోజు (శుక్రవారం) డెహ్రాడూన్‌లో అరెస్టు చేశారు.  ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.  నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండైన కాంతి రాణా  యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇదే కేసులో సస్పెండైన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్‌గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు.

తనకు సన్నిహితుడు, ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌కి లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు జత్వానీని టార్గెట్ చేశారు. దానికోసం గతంలో జెత్వానీతో పరిచయం వున్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాదంబరి జెత్వానీని అరెస్టు చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా జెత్వానీని రిమాండ్‌కి పంపించారు.  ఈ అక్రమ వ్యవహారానికి ఆద్యుడైన కుక్కల విద్యాసాగర్‌ని పోలీసులు అరెస్టు చేశారు.