ఇచ్ఛాపురంలో కంపించిన భూమి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం (జనవరి 8) రాత్రి పొద్దుపోయిన తరువాత భూమి కంపించింది. ఆ తరువాత మరికొన్ని గంటలకు అంటు గురువారం (జనవరి 9) తెల్లవారు జామున మరో మారు భూ ప్రకంపనలు సంభవించాయి.

ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే భూమి స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో వణికి పోయారు. రోడ్లపైకి పరుగులు తీశారు.