కొత్త ప్రభాకర్ రెడ్డి సేఫ్..మూడు గంటలు సర్జరీ..15 సెంటీమీటర్ల మేర చిన్న పేగు తొలగింపు
posted on Oct 31, 2023 7:34AM
ఎన్నికల ప్రచారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకరెడ్డి కత్తి దాడికి గురైన సంగతి తెలిసిందే. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారనీ, కోలుకోడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ దాడిలో ఆయన చిన్న పేగుకు నాలుగు చోట్ల లోతైన గాయం కావడంతో మూడు గంటలకు పైగా సర్జరీ చేశామని సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రాణాపాయం లేదనీ, అయితే నాలుగు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాలనీ వివరించారు. ఆ తరువాత ఆయన కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందన్న విషయంపై క్లారిటీ వస్తుందన్నారు. దాడి జరిగిన తర్వాత గజ్వేల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స జరిగిందని, ఆ గాయంతోనే తమ ఆస్పత్రికి వచ్చారని, వెంటనే డాక్టర్ల బృందం ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ట్రీట్‌మెంట్ మొదలుపెట్టిందని తెలిపారు.
చిన్న పేగుకు బలమైన గాయం కావడంతో వెంటనే సర్జరీ చేయాలనే నిర్ణయానికి వచ్చారని డాక్టర్ విజయకుమార్ తెలిపారు. లాప్రోస్కోపిక్ పద్ధతిలో సర్జరీ చేయడంలో ఉన్న ఇబ్బందులు, పరిమితులను దృష్టిల పెట్టుకుని జనరల్ సర్జరీ చేశామన్నారు. కడుపులో చిన్న, పెద్ద పేగులు కలిపి మొత్తం 4 చోట్ల గాయాలయ్యాయని తెలిసారు.
సర్జరీ చేసి చిన్న పేగులో 15 సె.మీ.ల మేర తొలగించామని వివరించారు. ఈ తరహాలో సర్జరీ జరిగిన తర్వాత రోగి కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. దీనికి తోడు ప్రభాకర్‌రెడ్డికి హైపర్ టెన్షన్ సమస్య ఉందన్నారు. మెడికో లీగల్ కేస్ కావడంతో అన్ని శాంపిల్స్ సేకరించి భద్రపరిచినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాతే ఏ మేరకు కొలుకున్నారో చెప్పగలమన్నారు. అనంతరం వార్డుకి షిఫ్ట్ చేస్తామన్నారు.