ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
posted on Dec 26, 2025 3:20PM

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ గ్రౌండ్స్‌పై అన్ ఫిట్‌గా గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత అన్ ఫిట్ పొందిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారిని సర్దుబాటు చేయనున్నారు. గతంలో మెడికల్ అన్‌ఫిట్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో వందలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ అన్‌ఫిట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.