కిర్లంపూడిలో టెన్షన్.. సెక్షన్ 30 అమలు..
posted on Jun 9, 2016 12:50PM

కాపు నేత ముద్రగడ పద్మనాభం తన నివాసం వద్ద నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. తుని ఘటనపై అరెస్టులను నిరసిస్తూ ఆయన దీక్ష చేపట్టారు. దీంతో కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాపు నేతలు పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి తరలివస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా సెక్షన్-30 అమలులో చేశారు. కిర్లంపూడి పరిసరాల్లో 3వేల మంది పోలీసులను మొహరించారు. కిర్లంపూడికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు మినహా గ్రామంలోకి ప్రైవేటు వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. గ్రామానికి వచ్చే వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. దీంతో పోలీసులు విధించిన ఆంక్షలపై కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా తుని ఘటనపై పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముద్రగడ తనను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.