కుడితి తొట్టెలో బల్లి కేసీఆర్!
posted on Apr 24, 2024 11:14AM
అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టెలో పడిందట. పాపం బల్లికి బయటి వాళ్ళ భవిష్యత్తు చెప్పడం తెలుసుగానీ, తన భవిష్యత్తే తనకు తెలియదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి కూడా కుడితి తొట్టెలో పడ్డ బల్లి తరహాలోనే వుంది. తన అధికారం ఊడిపోయే వరకు తనకు తెలియలేదుగానీ, ఏపీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని ఈయనగారు జోస్యం చెబుతున్నారు. వైసీపీ గెలుస్తుందన్న సమాచారం తన దగ్గర వుందట. కేసీఆర్‌కి ఆ సమాచారం ఏ తల మాసినవాడు ఇచ్చాడో! ‘నా దగ్గర సమాచారం వుంది’, ‘సరైన సమయంలో బయటపెడతా’ లాంటి పడికట్టు పదాలు ఇక కేసీఆర్ మానుకుంటే మంచింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని ఏపీలో జనాలు చెబుతున్నారు. నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైపీపీ పని ఖతం అని తేలిపోయింది. మరి ఫామ్ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కి అంత గొప్ప సమాచారం ఇచ్చిందెవరో! ఈయన ఒక సిద్ధాంతి.. ఈయనకి సమాచారం ఇచ్చినాయన ఒక వేదాంతి. సాధారణంగా బల్లి కుడితి తొట్టెలో పడకముందు శకునాలు చెబుతుంది. కుడితి తొట్టెలో పడిన తర్వాత శకునాలు చెప్పడాలేవీ వుండవు. కేసీఆర్ మాత్రం కుడితి తొట్టెలో పడిన తర్వాత కూడా శకునాలు చెప్పడమే ఇక్కడ వింత.
కేసీఆర్‌కి మొదటి నుంచీ ఏపీ అన్నా, చంద్రబాబు అన్నా ద్వేషం. ఏపీ సర్వనాశనం అయిపోతే కేసీఆర్ కళ్ళు చల్లగా వుంటాయి. గత ఐదేళ్ళలో జగన్‌తో కలసి తన కళ్ళను చల్లగా చేసుకున్న కేసీఆర్, మరో ఐదేళ్ళు ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక తమరి పప్పులు ఉడకవు కేసీఆర్.. ఈ ఎన్నికల తర్వాత మీరు, జగన్ కలసి భజన చేసుకుంటూ కూర్చోవాల్సిందే.