నీతి ఆయోగ్ వేస్ట్.. కేంద్రంలో కాంగ్రెస్ పాలనే భేష్.. మారిన కేసీఆర్ స్వరం

నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో శనివారం (ఆగస్టు6) ఢిల్లీలో జరిగిన సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. అందుకు ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. ఆ కారణాలేమిటన్నది అందరికీ తెలిసినవే. ఇటీవలి కాలంలో ఆయన కేంద్రంపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు.  ప్రధాని రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంలో  కూడా ఆయన ప్రొటోకాల్ ను పాటించకుండా మోడీని కలవలేదు. ఇటువంటి సందర్భాలు కనీసం మూడు ఉన్నాయి.

వీటిని బట్టి చూస్తే కేసీఆర్ మోడీకి ఎదురు పడటానికి కూడా ఇష్టపడటం లేదని ఎవరికైనా ఇట్టే అర్ధమౌతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మా కొట్టడం ఖాయమని అంతరూ ముందే ఊహించారు. అదే జరిగింది. అయితే ఈ సారి మాత్రం ఈ సందర్భాన్ని కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలేమిటో  చూచూయిగానైనా ప్రజలకు వివరించాలని, అదే సమయంలో మోడీ సర్కార్ పై విమర్శల వర్షం కురిపించడానికి ఉపయోగించుకున్నారు. నీతి ఆయోగ్ విషయంలో కేసీఆర్ మోడీ సర్కార్ పై గుప్పించిన విమర్శలను పక్కన పెడితే.. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పాలనపై కురిపించిన ప్రశంసలపైనే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురు గాలి వీస్తోందన్న విశ్లేషకుల అంచనాల నేపథ్యంలోనే కేసీఆర్ వ్యూహాలను అర్ధం చేసుకోవలసిన అవసరం ఉంది. వరుసగా రాష్ట్రంలో రెండు సార్లు టీఆర్ఎస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. ముచ్చటగా మూడోసారి కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే వ్యూహాలు మార్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తించారు. గత రెండు ఎన్నికలకు, రానున్న ఎన్నికలకు ప్రధాన తేడా ఏమిటంటే ఆ రెండు సార్లూ కేసీఆర్ ను గెలిపించిన తెలంగాణ సెంటిమెంట్ ఈ సారి వర్కవుట్ అయ్యే అవకాశాలు లేవు. అందుకే కేసీఆర్ అభివృద్ధి, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అభివృద్ధి విషయంలో కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచార చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్యల కారణంగా ఆ అభివృద్ధి ప్రచారం జనంలో ఎలాంటి ప్రభావం చూపడంలేదని అంటున్నారు.

ఇక మిగిలింది జాతీయ స్థాయిలో కేంద్రం వైఫల్యాలను ఎండగట్టడం. ఆ విషయంలోనే ఆయనకు మోడీతో చెడందంటున్నారు. ఇటు రాష్ట్రంలో ఎదురు గాలి.. అటు జాతీయ స్థాయిలో మద్దతు ఆశించినంతగా లేకపోవడంతో కేసీఆర్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఆయన వ్యూహం మార్చి కాంగ్రెస్ తో చెలిమి దిశగా అడుగులు వేస్తున్నారు. హస్తం పార్టీతో సయోధ్యకు తహతహలాడుతున్నారు. ఒక దశలో ఆయన టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కూడా సిద్ధపడ్డారన్న వార్తలు వచ్చాయి. అది నిజమైనా కాకపోయినా.. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక కూటమి కోసం చేసిన ప్రయత్నాలు విఫలమైన తరువాత కేసీఆర్ ఇక త్వమేవ శరణం నాస్తి అన్న చందంగా కాంగ్రెస్ నే నమ్ముకున్నారని అంటున్నారు. ఇందు కోసమే కాంగ్రెస్ కోరకపోయినా సోనియా, రాహుల్ లను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల్లో టీఆర్ఎస్ ఎంపీలను పాల్గొనాలని ఆదేశించారని అంటున్నారు. అలాగే ఇటీవలి కాలంలో ప్రత అంశంలోనూ ఆయన కాంగ్రెస్ విధానాలకు మద్దతు పలుకుతున్నారు.

అందలో భాగంగానే నీతి ఆయోగ్ సమావేశానికి డుమ్మ కొట్టడానికి గల కారణాలను వివరిస్తూ మీడియా సమావేశంలో కాంగ్రెస్ హయాంలోనే దేశంలో సుపరిపాలన భేషుగ్గా ఉందంటూ కితాబిచ్చేశారు. స్వతంత్ర భారతంలో నెహ్రూ హయాంను స్వర్ణ యుగంగా అభివర్ణించేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత కేసీఆర్ నోట కాంగ్రెస్ ప్రశంసలు రావడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తం మీద రానున్న రోజులలో కేసీఆర్ కాంగ్రెస్ కు మరింత దగ్గరైనా ఆశ్చర్యం