పైలట్లు..తల్లీకూతుళ్లూ!
posted on Aug 7, 2022 11:00AM
తల్లీకూతుళ్లు ఆటో ఎక్కారు..వంట గురించి, షాపింగ్ గురించి చర్చించుకున్నారు. ఇద్దరు తల్లీకూతుళ్లు పిల్లలు, భర్తతో ఇబ్బం దులు మాట్లాడుకున్నారు, మరో చోట ఇద్దరు పిల్లల బడి ఫీజులు, ఉద్యోగాల్లో మార్పులు, ట్రాన్స్‌ఫర్ల గురించి మాట్లాడుకున్నా రు. కానీ సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో హోటీ పెటిట్, కీలీ పెటిట్ మాత్రం సాంకేతిక ఇబ్బందులేమన్నా ఉన్నాయేమోనని ఒక్కసారి చూసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. అవును వీళ్లద్దరూ తల్లీ కూతుళ్లు. ఇద్దరూ పైలట్లు. కెప్టెన్ హోలీ పెటిట్, ఫస్ట్ ఆఫీసర్ కీలీ పెటిట్!
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో తల్లీకూతుళ్లు పైలట్స్‌గా ఉన్న తొలి జంట ఇదే! వీళ్లు నడిపే విమానం 3658 డెన్వర్ నుంచి సెంట్ లూయీ వరకూ వెళుతుంది. గత 23వ తేదీన వీళ్లిద్దర్నీ చూసి ప్రయాణీకులు ఎంతో ఆనందించారు. చాలామంది వీడియోల్లో బంధించారు. విడిగా ఫోటోలూ తీయించుకున్నారు. మరో పది నిమిషాల్లో విమానం బయలుదేరే ముందు ప్రయాణీకులకు హోలీ తన కుమార్తె కీలీని అందరికీ పరిచయం చేసింది. అందరూ ఆమెకు, ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నపిల్లగా ఉన్నపుడు విమానాశ్రయానికి తండ్రి తీసుకువస్తే కీలీ ముద్దగా చేతులూపుతూ తల్లికి గుడ్ బై, బెస్ట్ ఆఫ్ లక్! అని చెబుతూండేది. కొన్నేళ్ల తర్వాత ఇలా 18 ఏళ్ల పిల్లగా తన పక్కనే కూర్చుని నడపడాని సిద్ధపడిందని హోలీ తల్లిమనసుతో ఆనందం పంచుకుంది అంద రితో. పిల్ల బడికి వెళ్లడంలో కంటే ఇపుడు ఫ్లయిట్ నడపడానికి పక్కనే ఉండడంలో ఉండే ఆనందం ఆకాశమంత!
తనకు సినీ హీరోనో, క్రికెటరో, టెన్నిస్ ప్లేయరో అవాలనిపించలేదు.. తల్లిలా పైలట్ అయితే తల్లితోనే విమానంలో డ్రైవర్స్ వింగ్‌లో పనిచేయాలనుకుంది. అందుకే 14వ ఏటనే శిక్షణలో చేరి నాలుగేళ్ల శ్రమించి లైసెన్స్ సంపాదించింది కీలీ. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ లో 2017లో చేరింది. ఇటీవల ఇలా ఇద్దరూ కలిసేరు. మున్ముందు ఇలా కలుస్తారన్న నమ్మకం లేదు. డ్యూటీ, షిఫ్ట్లు లను అను సరించి ఉంటాయి గదా! ఇద్దరిదీ ఒక షిఫ్ట్ ఉండేట్టు కీలీ అధికారులను కోరిందిట. ఎప్పటికీ అలా ఒకే ఫిఫ్ట్‌లో వేయడానికి అదేమీ చిన్న ఉద్యోగం కాదు. అయినా అధికారులు అంగీకరిస్తారేమో చూద్దాం!