కేసీఆర్ ఏపీకి 200 కోట్లు విరాళం ఇవ్వాలనుకున్నారా?


 

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా పిలవడం, ఆయన మాటకు కట్టుబడి కేసీఆర్ కూడా కార్యక్రమానికి వెళ్లడం.. వీరిద్దరు సన్నిహితంగా ఉండటం చూసి ఇతర పార్టీ నేతలు విమర్శలు చేసుకోవడం ఇవన్నీ తెలిసిన విషయాలే. కానీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ కంటే కేసీఆర్ కే ఎక్కువ రెస్పాన్స్ రావడం ఆశ్చర్యకరం. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన కేసీఆర్ మాత్రం ఏపీకి ఓ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించుకుని వచ్చినట్టు తెలుస్తోంది.

నిజానికి చంద్రబాబు పిలవగానే అంగీకరించి అమరావతికి వచ్చిన కేసీఆర్ అక్కడ తనకు మంచి ప్రాధాన్యం దక్కుతుందునిముందే తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఏపీకి 200 కోట్లు భారీ విరాళం ప్రకటించాలని అనుకున్నారట. అయితే ఏపీ ప్రజలు అనుకున్నట్టే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాన మంత్రి ఏపీకి ఎదో ఒక ప్రకటన చేస్తారని కేసీఆర్ కూడా అనుకున్నారట. అయితే మోడీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కేసీఆర్ ప్రకటన చేయకుండా ఊరుకుండిపోయారట. ప్రధాన మంత్రి ఎటువంటి ప్రకటన చేయకుండా తాను ప్రకటన చేస్తే  బావుండదని ఆలోచించి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఏపీకి అంత విరాళం ఇవ్వాలనుకోవడం మెచ్చుకోతగిన విషయమే. ఒకవేళ కేసీఆర్ కనుక అలా చేసిఉంటే ఏపీ ప్రజల్లో ఎప్పుడూ నిలిచి ఉండేవాడు.