కేబీఆర్ పార్కు కాల్పుల కేసును ఛేదించిన పోలీసులు
posted on Nov 20, 2014 8:18AM
అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి మీద హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు దగ్గర కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కాల్పులు జరిపిన ఆగంతుకుడు వదిలి వెళ్ళిన బ్యాగ్‌లో ఆధారాల ద్వారా మెహిదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు అందులో కనిపించిన వ్యక్తిని నిత్యానందరెడ్డికి చూపించారు. నిత్యానందరెడ్డి అతన్ని గుర్తించడంతో అతను అంబర్‌పేటకు సీసీఎల్‌కి చెందిన కానిస్టేబుల్ ఓబులేశు అని గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి ఓబులేశును అనంతపురంలో అదుపులోకి తీసుకున్నారు. అతని అరెస్టు తర్వాత కాల్పులు జరిపింది ఓబులేశుయేనని నిర్ధారణైంది. ఈ కేసులో ఓబులేశుతోపాటు మరో ముగ్గురి ప్రమేయం కూడా వుందని దర్యాప్తులో వెల్లడయింది. గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం పోలీసులు ఓబులేశును మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం వుంది.