అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలుస్తాం.. కారెం శివాజి


 

అగ్రిగోల్డ్ రూ.27 వేల కోట్ల రూపాయల స్కాంకు పాల్పడిందని కారెం శివాజీ అన్నారు. దీనికి సంబంధించి ఆయన రూ. రెండు వేల కోట్ల బినామీ ఆస్తుల చిట్టాను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని..  స్కామ్ కు పాల్పడ్డవారిని శిక్షించి డిపాజిటర్లకు న్యాయం చేయాలని అన్నారు. అంతేకాదు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచి పోరాడుతామని స్పష్టం చేశారు.