‘ఏరువాక’ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు..

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  ‘ఏరువాక’ పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74-వూడేగోళంలో  చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమార్‌ అనే రైతు పొలంలో నేలతల్లికి పూజ చేసిన చంద్రబాబు ఏరువాకను ప్రారంభించారు. అనంతరం రైతు వన్నప్ప పొలంలో వేరుశనగ విత్తారు. కుమార్‌ పొలంలో సేద్యపు కుంటకు గంగపూజ చేసి.. రైతులు, అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఆపై నాగలి పట్టి స్వయంగా దుక్కి దున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే భూములు దుక్కి దున్ని, ఎరువులు, విత్తనాలను సమకూర్చుకున్న రైతులు తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ సీజనులో సకాలంలో, వర్షాలు కురుస్తాయని, సంతృప్తికర వాతావరణం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu