రెండు శక్తులు కలిశాయ్.. సైకోని తరిమేశాయ్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రకంగా ప్రాధాన్యం వున్న అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల తీరునే మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది. అదే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కీలక సమయంలో మరోసారి పొత్తు కుదరడం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన కులాలు.. కమ్మ, కాపు! కమ్మ కులానికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బలం ఎక్కువ వుంది. కాపు కులానికి కొన్ని ప్రాంతాల్లో రెడ్డి కులానికి బలం ఎక్కువుంది. బలం లేని ప్రాంతాల్లో రెండు కులాలకూ బలహీనత వుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు కులాలు ఒక్కటైతే మరో బలమైన కులం రెడ్డికి బలం తగ్గిపోతుంది. అందుకే చాలాకాలంగా ఈ రెండు కులాలు ఒక్క తాటిమీద నడవకుండా చేయడానికి ‘రెడ్డి’ నాయకులు శాయశక్తులా కృషి చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు, ఏర్పడిన తర్వాత తెలుగు రాజకీయాలలో రెడ్డి కులం ఆధిపత్యం కొనసాగేది. 1983లో ఎన్టీఆర్ రంగప్రవేశం చేసిన తర్వాత కమ్మ కులం బలమేంటో రాజకీయంగా రెడ్లకు అర్థమైంది. రాష్ట్ర రాజకీయాల్లో తమకు పెద్ద ముప్పు ఏమిటో అవతగమైంది. ఒక్క కమ్మకులాన్ని అయితే ఎలాగోలా ఎదుర్కోవచ్చు.  కమ్మ, కాపు కులాలు రెండూ కలిశాయా.. ఇక తమకు ఉనికే ఉండదని క్లియర్‌గా తెలిసిపోయింది. అందుకే ఈ రెండు బలమైన కులాల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. 

రంగాని ఎవరు హత్య చేశారో రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన సీనియర్లు చాలామందికి తెలుసు. కానీ, ఆ నేరాన్ని ఎన్టీఆర్ మీద, కమ్మ కులం మీద నెట్టారు. చేయని పాపాన్ని కమ్మ వారి మీద రుద్దారు. అప్పటి నుంచి కాపులు కమ్మ కులస్తులను శత్రువులుగానే చూస్తూ వచ్చారు. అప్పుడప్పుడు పాత పగలు చల్లారి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే సందర్భం వచ్చినా ‘రెడ్డి రాజులు’, కాపుల్లోనే వున్న ముద్రగడ లాంటి పెద్దలు చెడగొడుతూ వచ్చారు. 

ఎన్నో అవరోధాలను అధిగమించి కాపు కుల ఆశాదీపంగా వున్న పవన్ కళ్యాణ్‌కి, కమ్మ నాయకుడైన చంద్రబాబుకు మధ్య 2014లో పొత్తు కుదిరింది. అధికారం దక్కింది. రెండు కులాల సత్తా ఏమిటో తెలిసింది. మధ్యలో కొంతమంది క్రియేట్ చేసిన విభేదాలు ఇద్దర్నీ మళ్ళీ దూరం చేశాయి. దాంతో 2019లో అపజయం తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్ల సందర్భంగా ఈ రెండు కులాల నాయకులు ఒకే తాటిమీద నడవడం శుభ పరిణామం.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కమ్మ, కాపు కులాలకు చెందిన నాయకులు ఎన్నికలలో కలసికట్టుగా పనిచేశారు. కమ్మ కులం బలం తక్కువున్న చోట కాపు కులస్తులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. కాపు కులం బలం తక్కువున్న ప్రాంతాల్లో కమ్మ కులస్తులు కూటమిని బలోపేతం చేశారు. రెండు కులాలకూ బలం వున్న ప్రాంతంలో ఇక చెప్పేదేముంది... పండగే పండగ. దమ్మున్న కమ్మ కులస్తులు, ఊపున్న కాపు కులస్తులు... ఈ రెండు శక్తులూ కలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోని తరిమేశాయ్.