వైసీపీ కొత్త డ్రామా...రీ పోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి
posted on May 23, 2024 2:10PM
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్లలో రిగ్గింగ్ వ్యవహారం కోర్టుకెక్కింది. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు రిగ్గింగ్ కు పాల్పడిన వైసీపీయే కోర్టు మెట్లు ఎక్కింది. రిగ్గింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనే పిన్నెల్లి మీద చట్ట పర చర్యలు తీసుకోవాలని కోరే బదులు రీ పోలింగ్ డ్రామాకు వైసీపీ తెరలేపింది.
పల్నాడు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని, తనను తిరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్ చేశారని, రీపోలింగ్ నిర్వహించబోమని ముందుగానే ఈసీ చెప్పడం సరికాదన్నారు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారుఎన్నికల పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుమందిని చేర్చారు.
ఈ పిటిషన్ ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది.