జయలలిత మృతికి కారణాలు ఇవే.. ఎయిమ్స్ రిపోర్ట్...
posted on Mar 7, 2017 10:24AM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ అనుమానాల నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం జయ చికిత్స వివరాలపై రిపోర్ట్ ను తమిళనాడు ప్రభుత్వానికి అందించాయి. ఇక ఈ నివేదికపై ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఎయిమ్స్ వైద్యులు అందజేసిన నివేదిక ప్రకారం... ‘గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీ రాత్రి జయలలిత శ్వాసకోశ ఇబ్బందితో స్పృహ కోల్పోయిన స్థితిలో అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించినపుడు డీహైడ్రేషన్, జ్వరం, ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతున్నట్లు తేలింది. ఆమెను వెంటనే క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి అంతర్జాతీయస్థాయి వైద్యాన్ని ప్రారంభిం చాం. డిసెంబరు 3న జయను పరీక్షించిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స చేసిన వైద్యులను అభినందించారు. అయితే 4న ఆమె తీవ్ర గుండెపోటుకు గురికాగా ఎక్మో చికిత్స అందజేశాం. అయినా దుర దృష్టవశాత్తూ 5వ తేదీ రాత్రి 11.30 గంట లకు జయ తుదిశ్వాస విడిచారు’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. అమ్మ మృతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 8న నిరాహార దీక్షకు దిగుతున్న సంగతి తెలిసిందే.