ఏ దిక్కు చూడాల్నో.. సభలో నవ్వులు పూయించిన జగన్...
posted on Mar 7, 2017 9:46AM
ఏపీ రాజధాని అమరావతిలో నూతనంగా అసెంబ్లీని నిర్మించిన సంగతి తెలిసిందే. మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు ఈసారి అమరావతిలోనే జరుగుతుండటం విశేషం. అయితే ఈ అసెంబ్లీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యాధునికంగా ఏర్పాటు చేశారు. సభలో ఎక్కడా మైకులు లేకుండా సెన్సార్లు ఏర్పాడు చేశారు. అయితే ఈ ఏర్పాట్లపై మాట్లాడిన జగన్ సభలో నవ్వులు పూయించారు. ఇక జగన్ చేసిన వ్యాఖ్యలకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సహా అందరూ నవ్వారు. ఇంతకీ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటారా..ఎస్సీ, ఎస్టీ విద్యుత్ అమలుపై ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో జగన్ వ్యాఖ్యలకు మంత్రులు అచ్చెన్నాయుడు, గంటాలు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తనకు మైకు కావాలని కోరుతూ జగన్... "ఇంతకుముందు కొద్దొ గొప్పో మైకులు ఆన్ లో ఉన్నాయా? లేదా? అన్నది మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో తెలియడంలా. దీని దిక్కు చూడాల్నో, మీ దిక్కు చూడాల్నో మాకు అర్థం కావడంలా" అని వ్యాఖ్యానించి అందర్ని నవ్వించారు.