రెచ్చిపోయిన ఉగ్రవాదులు... బ్యాంకు దోపిడీకి యత్నం..

 

ఇప్పటివరకూ పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉగ్రవాదులు.. ఇప్పుడు దోపిడీకి దిగారు. జమ్మూకశ్మీర్‌ అనంతనాగ్‌లోని జమ్మూకశ్మీర్‌ బ్యాంకులో ఇద్దరు ఉగ్రవాదులు దోపిడీకి యత్నించారు. వారు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ గాయపడ్డాడు. భద్రతా సిబ్బంది ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకోగా.. మరో ఉగ్రవాది పరారయ్యాడు.