కాశ్మీర్‌లో మళ్లీ పాక్ జెండా రెపరెపలు..భారత్ వ్యతిరేక నినాదాలు
posted on Jun 18, 2016 6:03PM
జమ్మూకశ్మీర్‌లో పాక్ జెండాలు ఎగరడం షరా మామూలైపోయింది. తాజాగా వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నిన్న శ్రీనగర్‌లో నిర్వహించిన ర్యాలీలో మరోసారి పాక్ జెండాలు ఎగిరాయి. కాశ్మీర్‌లో ఆర్మీ, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులను వేరు చేసి వారికి ప్రత్యేక నిఘూ ఏర్పాటు చేసేందుకు విడిగా కాలనీలు కట్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అయితే ర్యాలీ జరుగుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్‌కు అనుకూలంగా.,భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా ఇస్లామిక్ స్టేట్, పాక్ జాతీయ పతాకాలను ఎగురవేశారు.