రైలుకు ఎదురెళ్లి యువతి ఆత్మహత్య..


 

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం తలమడ్ల గ్రామంలో ఓ యువతి వేగంగా వస్తున్న ట్రైన్ కింది పడి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి ఆత్మహత్యకు పాల్పడడాన్ని ఆగి ఉన్న ట్రైన్ లో కూర్చున్న ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. కాగా, సదరు యువతి టెట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. దీంతో తలమడ్ల గ్రామంలో విషాదం నెలకొంది.