కుప్పం 2029 ఆవిష్కరించిన చంద్రబాబు

కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు.  కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ ఇప్పటికే ఏర్పాట్లను సమీక్షించారు.  మధ్యాహ్నం ద్రవిడ యూనివర్శిటీ చేరుకుని ఆడిటోరియంలో కుప్పం 2029 విజన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైకాపా హాయంలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందన్నారు తెలుగు దేశం పార్టీ  పెట్టినప్పటి నుండీ కుప్పంలో టిడిపి జెండా ఎగురుతూనే ఉందన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి అంటే ఎటువంటి ఆసక్తి లేదన్నారు. కష్టపడితే ఎవరికైనా విజయాలు అవే వరిస్తాయన్నారు. తెలంగాణకు హైద్రాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుందని దీనికి ప్రధాన కారణం ఆనాడు తెలుగు దేశం పార్టీ చేసిన కృషి అన్నారు.