రఘురామ్ రాజన్ కు అసలు నిజం తెలిసిపోయిందా.. ?

 

రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా ఉన్న రఘురామ్ పదవిపై ఇప్పటికే ఎన్నో అనుమానాలు ఉన్న సంగతి తెలిసందే. ఈయనను గవర్నర్ పదవి నుండి తొలగించాలని ఒకపక్క బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపిస్తుంటే.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఈసారి కూడా ఆయననే గవర్నర్ గా కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రధాన మంత్రి మోడీ కూడా ఇంతవరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

 

అయితే రఘురామ్ రాజన్ కు మాత్రం ఈసారి పదవి దక్కకపోవచ్చని తెలిసిపోయిందో ఏమో కానీ... తాను మళ్లీ అధ్యాపక వృత్తిలోకి వచ్చి, పాఠాలు చెప్పుకొంటానని వ్యాఖ్యానించారు. భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా  తన పదవీకాలం సెప్టెంబర్ 4వ తేదీతో ముగుస్తుందని, ఆ తర్వాత మళ్లీ పాఠాలు చెప్పుకొంటానని ఆయన తన సహచరుల వద్ద అన్నారట. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి పదవి దక్కకపోవచ్చని అలా అన్నారా..? లేక మోడీ ప్రభుత్వం తనకు పదవి ఇవ్వడానికి సముఖత చూపించని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా అని అనుకుంటున్నారు. మరి అసలు నిజం ఏంటో రాజన్ కే తెలియాలి..