ఇదో జగన్మాయ.. ప్రభుత్వ ఖజానా నుంచే ఐప్యాక్ కు చెల్లింపులు?!

వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐప్యాక్ కు చెల్లింపులు ఎక్కడ నుంచి జరిగాయి అన్న విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఐ ప్యాక్ కు చెల్లించిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుంచే వెళ్లిందనీ, ఆ విధంగా జగన్ సర్కార్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందన్న విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  

ఈ విషయంపై నిజాల నిగ్టు తీయడానికి  చంద్రబాబు సర్కార్ సమాయత్తమైందని తెలుస్తోంది. ఐప్యాక్ కు వైసీపీ చెల్లింపులపై ఓ ప్రత్యేక బృందం ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. 2019, 2024 ఎన్నికలలో ఐ ప్యాక్  వైసీపీకి రాజకీయ, ఎన్నికల వ్యూహాలను అందజేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో ఐప్యాక్ కు జగన్ దాదాపు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. దానిని బట్టి 2024లో ఐప్యాక్ కు అంతకు మించి చెల్లింపులు జరిగి ఉంటాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత  అధికారం కోల్పోయే వరకూ అంటే 2019 నుంచి 2024 వరకూ ఐప్యాక్ ప్రభుత్వంలో భాగంగా మారిపోయింది.  

విశ్వసనీయ సమాచారం మేరకు జగన్  ఐప్యాక్ డైరక్టర్లతో బినామీ కంపెనీలు పెట్టించి వాటికి కొన్ని పాంప్లెట్లు.. ఇతర సామాగ్రి కాంట్రాక్టులు వాటికి ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేశారు.  దీంతో ఐప్యాక్ ద్వారా కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకుని ఎమ్మెల్యేలపై నిఘాకు నియోగించారు. వీరందరికీ వివిధమార్గాల ద్వారా ప్రభుత్వమే వేతనాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ లెక్కలన్నీ తేల్చి బండారం బయటపెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది.  ఇందుకోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పటు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐప్యాక్ చెల్లింపుల బాగోతాన్ని బట్టబయలు చేసే దిశగా తెలుగుదేశం సర్కార్ అడుగులు వేస్తోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu