ఏపీలో ఇక ఎపి ఎండిసి ద్వారా ఇసుక విక్రయం
posted on Jul 4, 2019 7:07PM
.jpg)
గత టిడిపి ప్రభుత్వ హయాం లో ఉచిత ఇసుక పథకం అమలయినా అటు ప్రభుత్వానికి ఆదాయం లేదు అలాగే ఇటు సామాన్యులకు ఇసుక అందుబాటు లో లేకుండా పోయింది సరి కదా ఇసుక మాఫియా పేరుతొ ప్రభుత్వ పతనానికి ఇది కూడా ఒక కారణం అయ్యింది. తాజాగా జగన్ నాయకత్వం లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ విషయం పై దృష్టు సారించింది. ఈ రోజు ఇసుక విధానంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఏపీ ఎండీసీ ద్వారా ఇసుక విక్రయం జరపాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 5 నుండి నూతన ఇసుక విధానం అమలు లోకి వస్తుండగా ఇసుక రీచ్ ల వద్ద స్టాక్ యార్డులు, పట్టణాలు, నగరాల్లో అదనపు స్టాక్ యార్డులు నిర్వహించాలని సూచించారు. ఇసుక ప్రస్తుత ధరకన్నా తక్కువ ధరకే అందించాలని ఆదేశించిన సీఎం జగన్, పర్యావరణాన్ని పరిరక్షించేలా నూతన విధానం రూపొందించి అమలు చేయాలనీ సూచించారు. ఇసుకపై వచ్చే ఆదాయం ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు వచ్చేలా ఉండాలని సూచించారు. ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, వేబ్రిడ్జ్ ద్వారా లెక్కించి, మొబైల్ అప్, వెబ్ సైట్ తో పాలసీని అందించాలని సీఎం సూచించారు. అలగే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇసుక బాధ్యతను సీఎం జగన్ అప్పగించారు.