టీడీపీ ఆఫీసుపై దాడి సూత్రధారుల గుర్తింపు!

జగన్ ప్రభుత్వం  అధికారంలో వున్న సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు మీద అధికార పార్టీకి చెందిన గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అత్యంత అమానవీయంగా జరిగిన ఈ దాడి అప్పట్లో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఇలాంటి గూండారాజ్యంలో మనం బతుకుతున్నామా అన్న ఆందోళన ప్రజల్లో కలిగించింది. జగన్ ఒత్తిడి మేరకు అప్పట్లో పోలీసులు ఈ కేసు మీద ధైర్యంగా దర్యాప్తు చేయలేకపోయారు. వైసీపీ రాక్షసపాలన ముగిసి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆనాటి సంఘటన మీద తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. 

ఆరోజు టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద జరిగిన దాడిలో మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీసు మీద దాడి జరిగినట్లు అరోపణలు వినిపించాయి. ఈ కేసులో దాదాపు 150 మంది మీద కేసులు నమోదు చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. దాడి జరిపిన వారిలో గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారే ఎక్కువ మంది వున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికల మీద పోలీసులు దృష్టి పెట్టారు.