వచ్చే నెలలో పెళ్లి...యూఎస్ అదుపులో భారత్ నేవీ ఆఫీసర్

 

వెనిజులాపై దాడి నేపధ్యంలో యూఎస్ ప్రభుతం ఆ దేశానికి రష్యా జెండాతో వెళ్తున్న మ్యారినెరా నౌకతో పాటు మరో దాన్ని సీజ్ చేసింది. మ్యారినెరా నౌకా సిబ్బందిలో ముగ్గురు ఇండియన్స్ ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది. వారు హిమాచల్ ప్రదేశ్, కేరళ, గోవాకు చెందిన వారు కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లోని పాలంపూర్‌కు చెందిన రక్షిత్ చౌహాన్ అనే మర్చంట్ నేవీ ఆఫీసర్‌కు వచ్చే నెల వివాహం జరగాల్సి ఉంది. 

చౌహాన్‌ను రష్యా సంస్థ తొలిసారి సముద్రం విధులకు.. అది కూడా వెనిజులాకు పంపింది. ఆ క్రమంలో జనవరి 7న చివరిసారి చౌహాన్‌తో మాట్లాడామని ఆయన కుటుంబం వెల్లడించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే అమెరికా దళాలు నౌకను అదుపులోకి తీసుకున్నాయి. అది తెలిసి రక్షిత్ చౌహాన్ తల్లి రీతాదేవి తన కొడుకు వివాహాన్ని ఫిబ్రవరి 19న నిశ్చయించామని, అతను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూడండని ప్రధాని మోడీని అభ్యర్ధించింది. ఈ పరిణామాలపై ఇప్పటికే భారత విదేశాంగ శాఖ స్పందించి చర్యలు చేపడుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu