అశోకచక్రం సూచించే 24 భావాలు
posted on Jan 26, 2019 1:58PM
మన భారత దేశ జాతీయ పతాకం...మువ్వన్నెల పతాకం...
దీని రూపకర్త...పింగళి వెంకయ్యగారు...మన తెలుగు వారు....
ఈయన స్వాతంత్రోద్యమంలో పాల్గొని...గాంధీజీని కలుసుకుని జాతీయ జెండా రూపకల్పన చేసి చూపించారు. అది చూసి గాంధీతాత ఆనందపరవశుడై కొన్ని మార్పులు సూచించారు.. వెంటనే వాటి ఆధారంగా పింగళి వెంకయ్య జెండా తయారు చేశారు.
ఇందులో కాషాయం రంగు... స్వచ్చతకు.ఆద్యాత్మికతకు త్యాగానికి గుర్తు
నిజంగా ఇది మన నాయకులు స్వలాభాన్ని విడిచిపెట్టి
తమ కర్తవ్యానికి అంకితం కావాలని సూచిస్తుంది.
తెలుపురంగు...... శాంతికి సత్యానికి గుర్తు.....
మన ప్రవర్తనకు నిర్దేశించే వెలుగుకు సత్యానికి గుర్తు.
ఆకుపచ్చరంగు.... సాఫల్యతకు, సస్య సమ్రుద్ధికి గుర్తు...మట్టితో మనకున్న అనుబంధాన్ని...
ఇతర జీవులన్నీ ఏ వృక్ష సంపద మీద ఆధారపడి ఉన్నాయో
ఆకుపచ్చని చెట్లకు గుర్తు అన్నారు...సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గారు.
అందులో ఉండే అశోకచక్రం....
ఈ చక్రంలో గల 24 ఆకులు ... 24 భావాలను సూచిస్తాయి అంటారు.... అవేమిటంటే...
1. ప్రేమ
2. ధైర్యము
3. సహనం
4. శాంతి
5. కరుణ
6. మంచి
7. విశ్వాసం
8. మృదుస్వభావం
9. సంయమనం
10. త్యాగనిరతి
11. ఆత్మార్పణ
12. నిజాయితీ
13. సచ్ఛీలత
14. న్యాయం
15. దయ
16. హుందాతనం
17. వినమ్రత
18. తాదాత్మయం
19. జాలి
20. దివ్యజ్ఞానం
21. ఈశ్వర జ్ఞానం
22. దైవనీతి (దివ్యనీతి)
23. దైవభీతి (దైవభక్తి)
24. దైవంపై ఆశ/నమ్మకం/విశ్వాసం
ఈ ఇరవైనాలుగు ఆకులు (స్పోక్స్), 24 గంటలూ భారత ప్రగతిని సూచిస్తాయి.
ఇదీ మన జాతీయ పతాకం వెనకనున్న కధనాలు...
ఉంటే చాలు జెండా...అదే ఇస్తుంది మనకి అండ......................శుభం..........