రెజ్లింగ్ లో ఇండియాకు మరో రెండు స్వర్ణాలు.. పసిడి పట్టు పట్టిన దహియా, వినేష్ పోగట్
posted on Aug 7, 2022 7:57AM
బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో రెజ్లింగ్ లో భారత్ మరో రెండె స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది.కామన్ వెల్త్ గేమ్స్ లో సత్తా చాటుతున్న భారత రెజ్లర్లు పసిడి పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా మరో రెండు స్వర్ణ పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి.దీంతో రెజ్లింగ్ లో భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య ఐదుకు చేరింది. శనివారం రవి దహియా, వినేష్ పొగట్ స్వర్ణాలు సాధించారు.అంతకు ముందు కుస్తీ వీరులు బజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన సంగతి తెలిసిందే.
ఇక శనివారం (ఆగస్టు 6) పురుషుల ఫ్రీ స్టైల్ 57కిలోల విభాగంలో ఫైనల్ లో రవి దహియా.. నైజీరియాకు చెందిన ఎబికేవినెమోను చిత్తు చేసి పసిడి సాధించాడు. మహిళల 53 కేజీల విభాగంలో వినేష్ పొగట్ .. శ్రీలంకకు చెందిన చమోద్య కేశనీపై విజయం సాధించింది. . దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 11కి చేరింది. రవి దహియా 3 సార్లు ఆసియా చాంపియన్ గా నిలిచాడు.
టోక్యో ఒలింపిక్స్ లోనూ రజత పతకం సాధించాడు. ఆడిన తొలిసారే కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడం విశేషం. వినేశ్ పొగట్ కూడా అరుదైన ఘనత సాధించింది. వినేశ్ పొగట్ కు కామన్ వెల్త్ గేమ్స్ లో ఇది వరుసగా మూడో పసిడి పతకం కావడం విశేషం. ఆసియా క్రీడల్లోనూ వినేశ్ పొగట్ స్వర్ణం సాధించింది. ఇలా ఆసియా గేమ్స్ తో పాటు కామన్ వెల్త్ గేమ్స్ లోనూ గోల్డ్ సాధించిన తొలి భారత మహిళగా వినేశ్ పొగట్ కామన్ వెల్త్ గేమ్స్ లో వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారత మహిళగానూ వినేశ్ పొగట్ చరిత్ర లిఖించింది.