భారత రాజ్యాంగంలో జరిగిన అతి ముఖ్యమైన సవరణల గురించి తెలుసా?

 

ఒక మతానికి పవిత్ర గంథం ఎలాంటిదో ఒక దేశానికి రాజ్యాంగం కూడా అలాంటిదే.  భారత రాజ్యాంగం విషయానికి వస్తే  భారతీయులకు అది చాలా  సౌకర్యాలు, చాలా షరతులు, మరెంతో సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది.  రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 వ తేదీన ఆమోందించారు అనే విషయం తెలిసిందే. అందుకే గణతంత్ర్య దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. అయితే రాజ్యాంగాన్ని రచించి ఆమోదం పొందిన తరువాత అవసరాన్ని బట్టి దాన్ని సవరణ చేస్తుంటారు.   ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన సవరణలు జరిగాయి అవేంటంటే..

7వ సవరణ..

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ సిఫారసు మేరకు భాష ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి.  ఈ సవరణ దేశానికి మెరుగైన పాలన నిర్మాణాన్ని అందిచంలో  ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.

42వ సవరణ..

ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో 42వ సవరణ జరిగింది. ఇందులో ప్రభుత్వం న్యాయవ్యవస్థ అధికారాలను పరిమితం చేసి కేంద్రానికి మరిన్ని అధికారాలు ఇచ్చింది.

44వ సవరణ..

ఆస్తి హక్కు అనేది మొదట ప్రాథమిక హక్కులలో బాగంగా ఉండేది. అయితే ఈ 42వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుండి తొలగించారు. అలాగే దీన్ని చట్టబద్దమైన హక్కుగా మార్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను సమతుల్యం చేసేందుకు ఈ సవరణ అవసరమైనట్టు పేర్కొన్నారు.

61వ సవరణ..

రాజకీయంలో యువత కీలకంగా ఉండాలని, ప్రభుత్వాల ఏర్పాటులో యువత ఆలోచనలు కీలకంగా ఉండాలని, యువశక్తిని చైతన్యం చేసేందుకు ఓటింగ్ వయస్సును కూడా సవరించారు. 61వ సవరణలో  ఓటు హక్కు వయసును 21 ఏళ్ళ నుండి 18 ఏళ్లకు తగ్గించింది.

73  వ సవరణ..

గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది.

86వ సవరణ..

రాజ్యాంగంలో పిల్లల చదువు కోసం జరిగి మార్పు దేశ భవిష్యత్తును,  పిల్లల జీవితాలను ఎంతగానో మార్పు దిశగా తీసుకెళ్లిందని చెప్పవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్భంద విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. ఇది పిల్లల ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంది.

101వ సవరణ..

101వ సవరణలో జియస్టి ని ప్రవేశపెట్టారు.  వస్తువులు సేవల పన్నును అమలు చేశారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు.

102 వ సవరణ..

102వ సవరణ జాతీయంగా వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది.

103వ సవరణ..

సాధారణ వర్గానికి చెందిన,  ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉద్యోగాలు,  విద్యలో 10శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.  ఈ రిజర్వేషన్ ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న SC, St< OBC కేటగిరీ వారికి వర్తించదు.

104వ సవరణ..

లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వు చేయబడిన సీట్లను రద్దు చేసింది.

                              * రూపశ్రీ.