వచ్చేనెల 10న వైమానికదళంలోకి రాఫెల్ ఫైటర్ జెట్స్

అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ విమానాలు రాఫెల్ యుద్ధ విమానాలు ఐదు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధవిమానాలు భారత్ వైమానికదళంలోకి ఇంకా అధికారికంగా చేరలేదు. వచ్చేనెల ( సెప్టెంబర్ ) 10న అధికారికంగా వీటిని భారత వైమానిక దళంలోకి తీసుకుంటారు.

 

ఫ్రాన్స్ నుంచి భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. వాటిలో మొదటి విడతగా ఐదు యుద్ధవిమానాలు జులై 29న భారత్ భూభాగంపై ల్యాండ్ అయ్యాయి. రెండో విడతగగా మరో నాలుగు యుద్ధవిమానాలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మరిన్ని యుద్ధవిమానాలు భారత్ చేరుకుంటాయి. భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులను ముందుగానే అంచనా వేస్తూ రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ సరిహద్దుల్లోకి చేర్చాలని వైమానిక దళం ఆలోచిస్తుంది. అందుకు అనుగుణంగా రాఫెల్ యుద్ధ విమానాలను వైమానిక దళంలోకి అధికారికంగా తీసుకుంటారు. ఈ కార్యక్రమానికి ఫ్రెంచ్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ ముఖ్యఅతిధిగా హాజరు అయ్యే అవకాశాలున్నాయి.