పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి రజనీకాంత్ జైలర్ 

పవన్ కళ్యాణ్(pawan kalyan)అప్ కమింగ్ మూవీస్ లో ఓజి (og)కూడా ఒకటి. ఎందుకో తెలియదు గాని హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్   కంటే ఓజి కే ఎక్కువ క్రేజ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది.ఇందుకు నిదర్శనంగా  పవన్ మీటింగ్స్ లోను, వేరే ఇతర సినిమా ఫంక్షన్స్  లోను ఓజి, ఓజి అంటూ ఫ్యాన్స్ పెద్ద  హంగామానే  సృష్టిస్తుంటారు.ఇప్పుడు ఆ హంగామాని పెంచడానికి ఒక విశిష్ట అతిధి ఓజి లో భాగస్వామ్యం కానున్నాడు.

గత సంవత్సరం రజనీ(rajinikanth)వన్ మాన్ షో జైలర్(jailer)ఎంత పెద్ద  హిట్టో అందరకి తెలిసిందే. ముఖ్యంగా హుకుం, టైగర్ కా హుకుం  సాంగ్ అయితే  పెద్ద  సన్సేషనే  సృష్టించిందని చెప్పవచ్చు.ఇండియా మొత్తం ఎక్కడ చూసినా కూడా మోత మోగిపోయింది.ముఖ్యంగా  అందులోని లిరిక్స్  రజనీ కి ఉన్న ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా సాటి చెప్పాయి.దీంతో అభిమానులైతే  ఇప్పటికీ హుకుం ని  తమ నోటి వెంట హమ్ చేస్తూనే ఉన్నారు. అసలు విషయంలోకి వస్తే హుకుం రైటర్ సూపర్ సుబు ఓ జి కి రెండు సాంగ్స్ రాయబోతున్నాడు. ఈ విషయం అధికారంగా కన్ఫార్మ్ అయ్యింది. దీంతో  పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. పవన్ ఇమేజ్ కి తగ్గట్టు ఎలాంటి లిరిక్స్ ని సుబు అందిస్తాడో అనే క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్ లో  ఏర్పడింది.   

ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఓజి కి  పవన్ కనుక కొన్ని రోజులు డేట్స్ కేటాయిస్తే  మూవీ కంప్లీట్ అయిపోతుంది. ఈ మేరకు మేకర్స్ కొన్ని రోజులు క్రితం పవన్ ని కలిశారు కూడా. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆర్ఆర్ఆర్(rrr)దానయ్య అత్యంత భారీ వ్యయంతో  నిర్మిస్తుండగా సాహో ఫేమ్ సుజిత్(sujith)దర్శకుడు. థమన్ మ్యూజిక్ కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్.